స్పీచ్ - Speech delay (Telgu)

Does your child have a speech delay (Telugu)

మీ పిల్లలకు ఇంకా మాటలు రావడం లేదా

స్పీచ్  ఆలస్యం – తల్లిదండ్రులందరూ తమ పిల్లల తొలి పలుకులు వీలైనంత త్వరగా వినాలని 
కోరుకుంటారు. పిల్లలు పెరిగేకొద్దీ  చిట్టిపొట్టి మాటలతొ మాటలు నేర్చుకోవడం 
ప్రారంభిస్తారు. కానీ చాలా మంది పిల్లలు తమ వయస్సులో ఉన్న పిల్లల కంటే 
ఆలస్యంగా మాట్లాడటం జరుగుతుంది. భారతదేశంలో ప్రతి 10 మంది పిల్లలలో ఒకరికి 
మాటలు రావడం ఆలస్యం అవుతాయిదినినే స్పీచ్ డిలే అంటారు. స్పీచ్ డిలేకి  చాలా 
కారణాలున్నాయిఅవి ఏమిటో ఈ వ్యాసంలో తెలుసుకుందాం. 

అసలు స్పీచ్ డిలే అంటె మిటి? 

సాధారణంగా రెండేళ్ల పిల్లలు దాదాపు 50 పదాలు మాట్లాడగలరు మరియు రెండు నుండి 
మూడు పదాల వాక్యాలను కూడా ఉపయోగించగలరు. మూడు సంవత్సరాల నాటికి 
పిల్లలకు సుమారు 1000 పదాలు తెలిసుంటాయి మరియు మూడు నుండి నాలుగు 
పదాల వాక్యాలను మాట్లాడటానికి ప్రయత్నించడం ప్రారంభిస్తారు.  
ఏ పరిస్థితులవల్లనైనాపిల్లలు తమ భాషలో పరిణామం చెందకపొతే వాళ్ళకి మాటలు 
రావడం ఆలస్యమయ్యాయని అంటే స్పీచ్ డిలే ఉంది అని చెప్పవచ్చు. ఇది 
కొన్నిసార్లు వినికిడి సమస్య లేదా నాడీ సంబంధిత సమస్యల వల్ల కూడా కావచ్చు. 
ఏ కారణాల వల్ల స్పీచ్ డిలే వస్తుంది? 
 • గర్భధారణ సమయంలో తల్లి శారీరక మరియు మానసిక ఆరోగ్య పరిస్థితి దెబ్బతిన్నా..
 • పిల్లలు నెలలు నిండకుండానే పుట్టినా..
 • పుట్టినప్పుడు ఆలస్యంగా ఏడ్చినా..
 • నరాల సమస్య ఉన్నా..
 • పిల్లల మెదడు గాయం అయినా.. 
 • వినికిడి లోపం ఉన్న పిల్లలు కూడా మాట్లాడటంలో వెనుకబడతారు.   
పిల్లలు ఆరు నెలల వయస్సు ఉన్నప్పుడు 17 రకాల శబ్దాలను గుర్తించగలరు, ఇది  
రకమైన భాషనైనా నేర్చుకోవడంలో మరియు అర్థం చేసుకోవడంలో మరింత 
సహాయపడుతుంది. 
మీ పిల్లల్లొ స్పీచ్ డిలేని ఎలా గుర్తించాలి? 
 • 6 నెలల వయస్సున్నపుడు క్కువగ బ్దాలు చేయకపోవడం..
 • 12 నుంచి 18 నెలల లోపు తమ మొదటి పదాలు మాట్లాడటం ప్రారంభించకపోవడం..
 • పేరు పెట్టి దేనినీ అడగకపోవడం..
 • రెండు సంవత్సరాల వయస్సులో  కనీసం 25 పదాలను ఉపయోగించకపోవడం 
మరియు రెండు పదాల వాక్యాలను మాట్లాడకపోవడం  
ఈ లక్షణాలు కనిపిస్తే పిల్లలు మాట్లాడడంలో వెనుక పడ్డారని చెప్పవచ్చు. 
మీ పిల్లలకు స్పీచ్ డిలే ఉంటె మీరు ఏమి చేయవచ్చు? 
 • మీ పిల్లలకు మాట్లాడటానికి తగిన అవకాశాలను కల్పించండి
 • మీ పిల్లలతో నెమ్మదిగా స్పష్టంగా మాట్లాడండి.
 • మీ పిల్లలతో ఒకరినొకరు అనుకరించే ఆటలు ఆడండి
 • మీ పిల్లలకు కొత్త పదాలను పరిచయం చేయండి
 • మీ పిల్లల పదాలకు ఇంకొన్ని పదాలను జోడించి పూర్తి వాక్యాన్ని చెప్పండి
 • మీ పిల్లలతో పిల్లల పాటలు పాడించండి
 • మీ పిల్లలకు పిల్లల పుస్తకాలు చదివి వినిపించండి 
స్పీచ్ డిలేకి చికిత్స ఎమిటి ? 
మీ పిల్లలకు స్పీచ్ డిలే ఉంటె స్పీచ్ థెరపిస్ట్ తొ థెరపి తీసుకొవాలి. స్పీచ్ థెరపిస్ట్  మీ 
పిల్లల మెదడు ఎదుగుదలనుసామజిక నైపుణ్యాన్నినోటి నిర్మాణం మరియు 
కండరాలను క్షుణ్ణంగా పరీక్షించి తగిన చికిత్సను ఇస్తారు తమ పిల్లల మాటలకు 
సంబంధించిన సందేహాలను స్పీచ్ థెరపిస్ట్ తొ చర్చించి చికిత్సలో ఎటువంటి 
ఆలస్యం లేకుండ ముందస్తు జోక్యం చేసుకొండి. 
 
1స్పెషల్ ప్లేస్ భారతదేశపు మొట్టమొదటి ఆన్లైన్ స్పీచ్ థెరపీ సంస్థమీరు మీ ఇంటి 
నుండే ఆన్లైన్ ద్వారా మా సేవలను పొందవచ్చు. మా సంస్థ 2014 నుండి 
ప్రపంచవ్యాప్తంగా వేలాది కుటుంబాలకు మా సేవలతో ఆసరానందించింది. మరిన్ని 
వివరాలకోసం  రోజే మా సంస్థను సంప్రదించండి!
We at 1SpecialPlace provide the Best Online Speech therapy In india. Speech is how you express yourself; it’s what we hear. We’ll collaborate with you to create your own specialized strategy and uncover your most effective communication. At 1SpecialPlace you have the right to be confident in your communication and to learn from the finest.
Click here to read more blogs
Share this

Leave a Comment

(0 Comments)

Your email address will not be published. Required fields are marked *